Nagababu: ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో రెండు ఎమ్మెల్సీలు కూటమి కైవసం చేసుకోగా మరొక ఎమ్మెల్సీ చేజారిపోయిందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే ఐదు ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకటి జనసేన మరొకటి బిజెపి మూడు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఈ పదవులను అందుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఇదే విషయం గురించి నిన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన అన్నయ్య నాగబాబు గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం. నాగబాబును అనకాపల్లి ఎంపీగా నిలబెట్టాలని గతంలో నిర్ణయించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ కోసం అలాగే కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడిన నాగబాబుకు తగిన గౌరవం ఇవ్వాలన్న నేపథ్యంలోనే ఆయనని ఎమ్మెల్సీ ద్వారా క్యాబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నాగబాబును జనసేన పార్టీ నుంచి ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అయిన తర్వాత తనని కేబినెట్లోకి మంత్రిగా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగబాబుకు మంత్రి పదవి పైన ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని, పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించామని గుర్తు చేశారు. ఎవరికి ప్రతిభ ఉంటే వారికి పదవులు దక్కుతాయని పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు అయితే ఈయనకు ఏ శాఖ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది .