Ram Charan: పార్లమెంట్ లోకి అబ్బాయి చరణ్… కేంద్రానికి స్పెషల్ రిక్వెస్ట్ పంపిన బాబాయ్ పవన్?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా తీవ్ర స్థాయిలో నిరాశపరిచినప్పటికీ రామ్ చరణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పెద్ది అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. చరణ్ త్వరలోనే పార్లమెంటు లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అసలు చరణ్ పార్లమెంట్ కు వెళ్లడం ఏంటి ఈయన పార్లమెంట్ ఎంట్రీ వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా ఈయన కూడా రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్ పార్లమెంట్ వెళ్లడం వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని సినిమా షూటింగ్లో భాగంగానే పార్లమెంటులోకి అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి . నిజానికి ఈ సినిమాలో పార్లమెంటులో షూట్ చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు కాస్త చాలా సహజసిద్ధంగా ఉండటం కోసం సెట్ వేయకుండా నిజంగానే పార్లమెంటులో ఒకరోజు షూటింగ్ జరుపుకోవాలని భావించారట.

అందుకుగాను చిత్ర బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించడంతో ఆయన తన పలుకుబడిన ఉపయోగించి కేంద్రానికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. గతంలో పార్లమెంటులో సినిమా షూటింగ్స్ అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా షూటింగ్స్ జరుపుకునే వారు కానీ ఇప్పుడు మాత్రం పార్లమెంటులో షూటింగ్స్ జరపాలి అంటే ఎన్నో నిబంధనలు ఉంటాయని వాటన్నింటినీ దాటుకొని షూటింగ్స్ జరపడం కష్టమవుతుందని అందుకే డిప్యూటీ సీఎంను సంప్రదించారని తెలుస్తోంది.