David Warner: డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఆస్ట్రేలియా క్రికెటర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ ఇటీవల పుష్ప సినిమాలో ప్రతిపాటకు రీల్స్ చేస్తూ తెగ ఫేమస్ అయ్యారు. ఇలా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈయన ఎంతో సుపరిచితం అయ్యారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు.
2025 IPL లో డేవిడ్ వార్నర్ కోనుగోలు కాలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ప్రస్తుతం ఈయనకు సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి వారు అధికారికంగా తెలియజేశారు.
మైత్రి మూవీ సమస్థ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఒక ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పారు. ఈ సంస్థ నిర్మిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు ప్రొడ్యూసర్ రవిశంకర్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
మరి మైత్రి వారి నిర్మాణంలో డేవిడ్ వార్నర్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో నితిన్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఆయన పాత్ర ఏంటి తన నటన ఎలా ఉండబోతుందని ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.