Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది అంటూ ఇటీవల కాలంలో వరుసగా నేతలందరూ పాట పాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల బిఆర్ఎస్ నేతలు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏ క్షణమైన పదవి నుంచి దిగిపోవచ్చు అంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని ఏ క్షణమైన ఈయన ఆ పదవి నుంచి దిగిపోవచ్చు అంటూ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కూడా మారిపోయారు .ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కూడా మార్చాలని ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందని తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
మీనాక్షి నటరాజ్ ఇన్చార్జిగా నియమితులు కావడానికి మిషన్ సీఎం ఛేంజ్ అనే టాస్క్ కారణమని తెలిపారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఉత్తంకుమార్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈయన తెలంగాణలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఢిల్లీ చేర వేస్తున్నారని కూడా మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆశీర్వాదం నాపై ఉండాలని మాట్లాడుతున్నారు. అయితే ఆయన పదవికి గండం ఏర్పడిందని తన భవిష్యత్తు ఏంటో రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే అలా మాట్లాడారని తెలిపారు అయితే ఆయనకు రాష్ట్ర ఆడబిడ్డల ఆశీర్వాదం కాదని ఢిల్లీ నుంచి వచ్చిన ఆడపిల్ల మీనాక్షి నటరాజ్ ఆశీర్వాదం ఉండాలి అంటూ ఈయన మాట్లాడారు. ఇలా రేవంత్ రెడ్డి పదవి గురించి మహేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి గురించి చర్చలు మొదలయ్యాయి.