Samyuktha Menon: అవును నేను మందు తాగుతాను….ఓపెన్ అయిన నటి…ఇలా చెప్పేసిందేంటీ!

Samyuktha Menon:  సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే వారి అందం విషయంలోనూ తినే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఆ విషయాలను పెద్దగా బయట పెట్టరు. ఇక హీరోయిన్స్ ఏదైనా పార్టీలకు వెళితే ఆల్కహాల్ కూడా తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ విషయాలను ఎవరు కూడా బయటపెట్టరు. ఇటీవల కాలంలో పార్టీలలో మందు తాగడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది.

ఇలా సెలబ్రిటీలందరూ కూడా పార్టీలలో పెద్ద ఎత్తున ఆల్కహాల్ తీసుకుంటారు కానీ ఇప్పటివరకు ఎవరు వీటి గురించి ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ ఓ ముద్దు గుమ్మ మాత్రం నేను మందు తాగుతాను అంటూ ఓపెన్ గా చెప్పడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి మందు తాగుతాను అంటూ నిజాలను బయటపెట్టిన ఆ బ్యూటీ ఎవరు అనే విషయాన్నికి వస్తే ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు నటి సంయుక్త మీనన్.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త అనంతరం విరూపాక్ష, సార్, బింబిసారా వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంయుక్త ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మందు తాగడం గురించి ఓపెన్ అయ్యారు.

తనకు మందు తాగే అలవాటు ఉందని తెలిపారు అయితే క్లోజ్ ఫ్రెండ్స్ పార్టీలు అరేంజ్ చేసినప్పుడు మాత్రమే తాను మందు తాగుతాను అది కూడా లిమిట్ గానే తాగుతానని తెలిపారు. ఇక ఎప్పుడైనా వర్క్ పరంగా నేను కాస్త ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకొనే అలవాటు నాకుందని సంయుక్త మీనన్ తెలిపారు. అయితే మందు తాగడం గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడేయాలి అంటే కూడా ఎంతో ధైర్యం ఉండాలి సంయుక్త మీనన్ ఎలాంటి దాపరికాలు లేకుండా ఈ విషయాన్ని ఎంతో ధైర్యంగా బయటపెట్టారు అంటూ కొందరు భావించగా మరికొందరు ఎంత మందు తాగితే మాత్రం ఇలా చెప్పేసింది ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.