Roja: రేపు జరగబోయేది కూడా అదే… వడ్డీతో సహా చెల్లిస్తాం… పోసాని అరెస్టును ఖండించిన రోజా?

Roja: కూటమి ప్రభుత్వం వైసిపి నేతలపైన లేనిపోని కేసులను నమోదు చేస్తూ వరుసగా అందరిని అరెస్టులు చేయిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈమె పోసాని అరెస్టును పూర్తిగా ఖండించారు. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా…? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా అంటూ రోజా ప్రశ్నించారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా వైసిపి వారికి సహాయం చేయొద్దు అంటూ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని తెలిపారు. వైసిపి వారికి పనులు చేయొద్దు అంటూ చెప్పే చంద్రబాబు నాయుడు వైసిపి వారితో పన్నులు కట్టించుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి ఎదురు మాట్లాడిన ఆయన తప్పులని ఎత్తి చూపిన సహించలేకపోతున్నారని తెలిపారు.

అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చడం లేదని తెలిపారు. కూటమి నేతలు రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ ఎల్లో బుక్ లో ఇచ్చిన ఎన్నికల హామీల గురించి పెట్టి ఉంటే బాగుండేదని తెలిపారు. పజలకు ఎలాంటి మంచి చేయకపోయినా ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి వెళ్లి స్టికర్లు అతికించారు కానీ ఇది మంచి ప్రభుత్వం కాదని ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందని తెలిపారు.

ఇలా వైసిపి నేతలపై దారుణంగా కేసులు నమోదు చేసే అరెస్టులు చేయిస్తున్నారు. రేపు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాము అంటూ కూటమి నేతలకు రోజా తనదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.