టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాకు డిజాస్టర్ టాక్ ఇచ్చినా ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దృష్టి పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కిల్ సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు నగేష్ భట్ చరణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా ఒకింత సంచలనం సృష్టించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యకమవుతున్నాయి. రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
రామ్ చరణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే మొదట ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిందని విజయ్ దేవరకొండ ఈ సినిమాకు అంగీకరించకపోవడంతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందని భోగట్టా. రామ్ చరణ్ ఈ సినిమాకు ఓకే చెప్పారో లేక రిజెక్ట్ చేశారో చూడాల్సి ఉంది. చరణ్ కెరీర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
రామ్ చరణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రామ్ చరణ్ కు మంచి గుర్తింపు ఉండటంతో రామ్ చరణ్ కు ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.