మనలో చాలామంది కొన్ని విషయాలను నమ్మడానికి అస్సలు ఇష్టపడరు. అయితే దేవుడిని నమ్మేవాళ్లు మాత్రం చాలామంది ఉంటారు. ఒక దేవాలయ ప్రాంగణంలో నిద్రిస్తే పిల్లలు పుట్టే భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ ఆలయంలో ఉండే దేవత పేరు సిమ్సా దేవత కాగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియకపోయినా హిమాచల్ ప్రదేశ్ సమీప రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ ఆలయం గురించి బాగా తెలుసు.
నవరాత్రి పండుగ సమయంలో పిల్లలు లేని స్త్రీలు ఈ ఆలయంలో నిద్రిస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు. ఎవరైతే దేవతపై పూర్తి నమ్మకంతో ఆలయానికి వస్తారో వారికి దేవత కలలో కనిపిస్తుందని చాలామంది భావిస్తారు. కలలో మనిషి రూపంలో కనిపించే దేవత పిల్లలు పుట్టాలని ఆశీర్వదించడంతో పాటు కలలో దేవత పువ్వు లేదా పండును స్వీకరిస్తే పిల్లలు పుడతారని చాలామంది బలంగా నమ్ముతారు.
ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్రించే స్త్రీకు కలలో బెండకాయ కనిపిస్తే అమ్మాయి, జామకాయ కనిపిస్తే అబ్బాయి పుడతారని చాలామంది భావిస్తారు. స్త్రీకి కల వచ్చిన వెంటనే ఆమె ఆలయం నుంచి వెళ్లిపోవాలి. సిస్సా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద రాయి ఉంది. ఈ రాయికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది. పెద్దవాళ్లు కదిలిస్తే కదలని ఈ రాయి పిల్లలు కదిలిస్తే మాత్రం కదులుతుంది.
స్త్రీలకు కలలో చెక్క లేదా మెటల్ కనిపించినా పిల్లలు పుడతారని చాలామంది బలంగా నమ్ముతారు. ఇప్పటివరకు పిల్లలు పుట్టని దంపతులు ఉంటే ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా చేరుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.