పరగడుపున ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, చర్మం మరియు కంటి చూపుకు మేలు కలుగుతుంది, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరెంజ్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అతిసారం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్‌లోని విటమిన్ సి చర్మం మరియు కంటి చూపుకు మేలు చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌లో పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, హెస్పెరిడిన్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఆరెంజ్ జ్యూస్ తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పరగడుపున ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఏకంగా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకు రెండు గ్లాసుల వరకు కమలా రసం తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి, గంధకం లభిస్తాయి. కాం, వాతం, అజీర్ణాలను హరించి తేజస్సును పెంచడంలో ఆరెంజ్ జ్యూస్ కు సాటిరాదని చెప్పవచ్చు.
మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో ఉండే కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆరెంజ్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.