Madhu Priya: సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు.ఆమెపై హిందువులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సింగర్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా సింగర్ మధుప్రియ పై హిందువులు ఆగ్రహం చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ప్రస్తుతం మధుప్రియ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అదేవిధంగా ఈమెప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.
మధు ప్రియ తాజాగా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ను భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూటి చేయడం వివాదానికి దారి తీసింది. ఇలా ఈ ఆలయంలో ఈమె తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేయడమే కాకుండా భక్తులు ఎవరూ కూడా గుడి లోపలికి రాకుండా ఈమె ఏకంగా గుడి తలుపులు కూడా మూయించారు. ఇలా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో ఈ పాట షూటింగ్ చేశారు.
ఈ విధంగా మధుప్రియ గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో ఈ విషయంపై హిందూ సంఘాల నేతలు భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడిలో ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతి లేదు అలాంటి విష్ణు ప్రియ ఎలా తన ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ జరుపుకుంది ఈమెకు ఎవరు అనుమతి ఇచ్చారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గుడి తలుపులు మూసేసి ఇలా గర్భగుడిలో షూటింగ్ జరపడం ఏంటి కొంచమైనా బుద్ధుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా మధుప్రియ వ్యవహార శైలి తీవ్రస్థాయిలో వివాదానికి కారణమైన దీంతో వెంటనే ఈమెపై చర్యలు తీసుకోవాలని తనని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవాలయంలో ఫొటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్లిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.