ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అనే భయం చాలామందిని వేధిస్తోంది. అయితే కొన్ని ఉద్యోగాలు మాత్రం ఏఐ అవసరం లేని ఉద్యోగాలు కాగా ఈ ఉద్యోగాలలో చేరడం ద్వారా భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెప్పవచ్చు. హెల్త్ కేర్ రంగంలో పని చేసేవాళ్లకు ఏఐ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగంలో అవసరాలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవని చెప్పడంలో సందేహం అవసరం లేదు. టీచింగ్ రంగంలో ఉండేవాళ్లకు సైతం భవిష్యత్తులో ఏఐ వల్ల ఇబ్బందులు ఉండవు. లాయర్ ఉద్యోగాలు, ఇతర లీగల్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేసేవాళ్లకు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి సమస్య లేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
కళాకారులు, కళాకారుల రంగంలో పని చేసేవాళ్లకు సైతం ఏఐ వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పవచ్చు. వంటలకు సంబంధించి ఉద్యోగాలు చేసేవాళ్లకు, హోటల్ రంగంలో ఉండేవాళ్లకు సైతం ఏఐ వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. శాస్త్రవేత్తలకు సైతం ఏఐ వల్ల నష్టం చేకూరదని చెప్పవచ్చు. సోషల్ వర్కర్లు సైతం ఏఐ వల్ల నష్టపోరని చెప్పవచ్చు.
ఎలక్ట్రికల్ వర్కర్లు, ప్లంబర్, ఇతర చేతి వృత్తుల పనులు చేసేవాళ్లు సైతం ఏఐ వల్ల ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉండదు. ఈ ఉద్యోగాలలో కొనసాగేవాళ్లు సైతం భవిష్యత్తులో సైతం ఏఐ వల్ల టెన్షన్ పడే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లకు మాత్రం తిరుగులేనట్టేనని కామెంట్లు వినిపిస్తాయి.