“థలపతి 67” కి విజయ్ మైండ్ బ్లాకింగ్ పారితోషకం.!

తమిళ సినిమా నాట హ్యుజ్ స్టార్డం అండ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో థలపతి విజయ్ కూడా ఒకడు. అయితే ఒకప్పుడు ఉన్న సీనియర్ స్టార్ హీరోలతో సమానంగా విజయ్ క్రేజ్ అయితే నెలకొంది. కాగా తమిళ్ మరియు తెలుగు లో రీసెంట్ గానే తన కొత్త సినిమా వారసుడు తో హిట్ కొట్టగా జస్ట్ మొన్ననే తన కెరీర్ లో 67వ సినిమాని కూడా స్టార్ట్ చేసేసాడు.

ఇక ఈ సినిమాకి దర్శకుడు లోకేష్ కనగ రాజు తెరకెక్కించనుండగా నిన్న తమిళ్ లో పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు విజయ్ అందుకుంటున్న పారితోషకం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 130 కోట్లు శాలరీ తీసుకుంటున్నాడట. ఇది ఇప్పుడు తమిళ్ హీరోస్ లో భారీ రికార్డు అన్నట్టు తెలుస్తుంది.

అలాగే ఇంకో పక్క ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా విక్రమ్ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇప్పుడు చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 కి కూడా అంతే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ప్రస్తుతానికి వీరిద్దరూ కోలీవుడ్ లో టాప్ లో ఉన్నారు. అలాగే సూపర్ స్టార్ రజిని కాంత్ ప్రస్తుతం “జైలర్” సినిమాకి గాను 80 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా అక్కడి సినీ వర్గాల నుంచి టాక్.