శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో మరో జంటపై క్లారిటీ.!

ఈరోజు తో టాలీవుడ్ లో ఉన్నటువంటి మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే హీరో శర్వానంద్ కూడా ఎట్టకేలకు పెళ్లి భాజాలు మోగించాడు. మరి ఈరోజు తాను హైదరాబాద్ లో తన ఫియాన్స్ తో నిశ్చితార్థం జరుపుకోగా టాలీవుడ్ స్టార్స్ చాలా మందే ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా చాలా మందే వచ్చి ఈ యువ జంటని ఆశీర్వదించారు. అయితే శర్వానంద్ తమిళ్ లో కూడా మంచి సినిమాలు చేసాడు అలాగే అక్కడి స్టార్స్ కూడా కొందరు రాగా వారిలో హీరో సిద్ధార్థ్ కూడా రావడం విశేషం.

అయితే తాను ఒక్కడే వచ్చాడు అనుకుంటే అందులో విశేషం లేదు కానీ తనతో పాటుగా నటి అదితి రావు హైదరి కూడా కనిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి జంట పై ఇది వరకే డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. శర్వానంద్, సిద్ధార్థ్ అలాగే అదితి కలిసి మహాసముద్రం అనే సినిమా చేశారు.

అలా వీరి పరిచయం అవ్వొచ్చు కానీ సినిమా కూడా పెద్దగా రాణించలేదు అక్కడ నుంచి సిద్ధార్థ్ అదితి ల రిలేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. కాగా మళ్ళీ ఈ జంట ఇలా పెళ్ళిలో ఒకేసారి కనిపించడంతో వీరి పై ఉన్న రూమర్స్ నిజమే అన్నట్టుగా క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. ఇది వరకే సిద్ధార్థ్ చాలా మంది స్టార్స్ తో ప్రేమాయణం జరిపిన సంగతి తెలిసిందే. దీనితో ఇది కూడా కామనే అన్నట్టుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.