శారద కళ్ళెదురుగానే తన భర్తను లాగిపెట్టి కొట్టిన సీనియర్ హీరో.. అసలేమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి శారద గురించి పరిచయం అవసరం లేదు ఈమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలు అందరు సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కీలక పాత్రలలో నటించి మెప్పించారు. ఇకపోతే శారద సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్ళబాటపై ప్రయాణం సాగించింది. శారద కొరడా సింహాచలం ఇద్దరు ఎన్నో సినిమాలలో కలిసిన నటించడం వల్ల వీరిద్దరి ప్రేమ ఏర్పడి ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది.

 

కొరడా సింహాచలం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తనలో విలన్ క్యారెక్టర్ కూడా ఉందని పెళ్లయిన తర్వాత శారదకు మాత్రమే తెలిసింది.ఇలా వివాహం తర్వాత సినిమాలలో నటిస్తున్న శారద పట్ల అనుమానం అనే బీజాన్ని తన మనసులో నాటుకొని ప్రతిక్షణం తనని అనుమానిస్తూ హింసించేవారు.ఇలా తన భర్త పెడుతున్న బాధలను బరిస్తూనే సినిమాలలో నటిస్తున్నటువంటి శారదను ఏకంగా సెట్లో కూడా తనపై చేయి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

 

సింహాచలం ఒకరోజు ఎన్టీఆర్ శారద కలిసే నటిస్తున్న సినిమా షూటింగ్ ఏవీఎం స్టూడియోలో జరిగింది. అయితే అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న సింహాచలం లొకేషన్ లోకి రావడమే కాకుండా డైరెక్ట్ గా మేకప్ రూమ్ కి వెళ్లి శారద పై చేయి చేసుకున్నారు. ఈ విషయం డైరెక్టర్ ద్వారా ఎన్టీఆర్ గారికి తెలియడంతో ఎన్టీఆర్ ఆవేశపడుతూ సింహాచలాన్ని చొక్కా పట్టుకొని ఏంటి బ్రదర్ ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ లాగిపెట్టి తనని కొట్టారట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.