తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలివలపు అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం ఈయన రెండవ సినిమాలో విలన్ పాత్రలలో నటించారు. ఈ విధంగా జయం సినిమాలో ఈయన విలన్ గా నటించడంతో తన పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం వర్షం నిజం వంటి సినిమాలలో కూడా గోపీచంద్ విలన్ గా నటించారు.
ఈ మూడు సినిమాలలో విలన్ గా నటించిన గోపీచంద్ అనంతరం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. ఇక ఈ ఏడాది కూడా ఈయన పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈయన కెరియర్ మొదట్లో విలన్ గా ఎందుకు నటించారు.. అలా నటించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ తాను తొలివలపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తనకు అవకాశాలు పూర్తిగా రాలేదు.ఆ సమయంలో ప్రముఖ డైరెక్టర్లు అయినటువంటి కృష్ణవంశీ తేజ గారిని కలవడంతో వాళ్లు నాకు విలన్ పాత్రలలో నటించమని సలహా ఇచ్చారు. వారు చెప్పిన విధంగానే తాను వర్షం నిజం వంటి సినిమాలలో విలన్ పాత్రలలో నటించానని అయితే తనకు ఈ పాత్రలు చాలా మంచి గుర్తింపు తీసుకురావడంతో అనంతరం హీరోగా అవకాశాలు వచ్చాయని గోపీచంద్ తెలిపారు.ఆ ఇద్దరు డైరెక్టర్ల వల్లే తాను విలన్ గా మారానని ఈయన చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.