మీకు గుర్తుందా? నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన ఇద్దరు అమ్మాయిలు అనే సినిమా ఉంది కదా. అందులో నా హృదయపు కోవెలలో.. నా బంగరు లోగిలిలో.. అనే ఓ పాట ఉంది కదా. ఆ పాట ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఆ పాటను పాడింది ఎస్పీ బాలు.
నిజానికి ఆ పాటను పాడాల్సింది ఘంటసాల. ఆ సమయంలో నాగేశ్వరరావు పాటలన్నీ ఘంటసాల పాడేవారు. నాగేశ్వరరావు గొంతుకు ఘంటసాల గొంతు సరిగ్గా సరిపోతుందని.. ఎక్కువగా ఘంటసాలతోనే ఏఎన్నార్ పాటలను పాడించేవారు.
అయితే.. ఇద్దరు అమ్మాయిలు సినిమాలోని ఆ పాటను ఘంటసాల పాడటానికి ముందే రికార్డింగ్ కోసమని.. ఎస్పీ బాలుతో ట్రాక్ పాడించారు. ఆ ట్రాక్ ను విన్న ఘంటసాల… బాలసుబ్రహ్మణ్యం చాలా బాగా పాడారు. దాన్ని ఎందుకు మార్చి మళ్లీ నేను పాడటం. అది బాగా ఉంది కదా. దాన్నే ఉండనీయండి అన్నారట.
దీంతో ఆ సినిమా పెద్దలు.. నిజమే కానీ.. నాగేశ్వరరావుకు మీ కంఠం సరిగ్గా సరిపోతుంది కదా అన్ని ఘంటసాలకు చెప్పారట. దీంతో ఏం కాదు.. బాలు బాగా పాడాడు. ఆయన కంఠం కూడా బాగుంది. నాగేశ్వరరావు గొంతుకు సరిపోతుంది. ఏఎన్నార్ కు నేను చెబుతాను. అదే ఉంచండి.. చాలా భావయుక్తంగా ఉంది ఆ పాట.. అని ఘంటసాల చెప్పారట. అలాగే.. ఆ పాటను బాలు పాడారు. మీరు కూడా ఓసారి ఆ పాటను వినండి…