రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు: ఓం రౌత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు టాలీవుడ్ ని ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ కీ సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ప్రభాస్ కు ఒక అరుదైన గౌరవం దక్కనుంది. ఈ సంవత్సరం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా పండుగ రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొన్న బోతున్నాడు.

ఇకపోతే మొన్నటి వరకు ఈ వార్తపై జోరుగా వార్తలు వినిపించాయి. కానీ తన పెదనాన్న మరణంతో ప్రభాస్ వచ్చే పరిస్థితులు లేవు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగనున్న రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు అంటూ ప్రకటించేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం ప్రభాస్ కి అందిన విషయం తెలిసిందే.

అక్టోబర్ 5వ తేదీన ఈ విజయదశమి వేడుకలు రోజు ప్రభాస్ అక్కడికి చేరుకున్నారు. కాగా ప్రతి ఏడాది కూడా దసరా పండుగ రోజున రావణుడి దిష్టిబొమ్మను కాల్చి వేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీల మైదానంలో జరగబోయే ఈ దసరా వేడుకలకు అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు.. అయితే ఈ రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే గొప్పవారు ఎవరు ఉంటారు అని అందుకే ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.