రాజకీయం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు.. పవన్ తో స్నేహం గురించి అలీ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాలో కామెడీ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అలీతో సరదాగా అని కామెడీ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా హీరో పవన్ కళ్యాణ్, అలీ మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ మంచి స్నేహితులుగా గుర్తింపు పొందారు.

పవన్ కళ్యాణ్ అలీతో ఉన్న స్నేహబంధం వల్ల తాను నటించే ప్రతి సినిమాలోను అలికి ప్రత్యేకంగా ఒక పాత్ర ఉండాలనే దర్శక నిర్మాతలకు చెప్పేవాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలోను అలీ నటించేవాడు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అలీ పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ 2019లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున ప్రచారం చేసి పార్టీ గెలవడానికి తన వంతు కృషి చేశాడు. అయితే అప్పటినుండి పవన్ కళ్యాణ్, అలీ మధ్య స్నేహబంధం చెడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి మద్దతు చేయకపోవడం గురించి అలీ నీ ప్రశ్నించగా… పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తనకు మంచి స్నేహితుడని.. కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేస్తానని ఆలీ వెల్లడించాడు. అంతేకాకుండా ఇటీవల అలీ తన కూతురు పెళ్లిని ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుండి ఎంతోమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాకపోవటంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ని పవన్ కళ్యాణ్ మీ కూతురు పెళ్లికి రాకపోవటానికి మీ మధ్య ఉన్న దూరమే కారణమా? అని ప్రశ్నించగా..
” మా ఇద్దరి మధ్య ఎటువంటి దూరం లేదు కావాలని అందరూ క్రియేట్ చేస్తున్నారు” అంటూ అలీ సమధానం చెప్పాడు.