Pushpa 2 – Miss You: టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రేమకథా చిత్రాల ద్వారా యువత హృదయాలను గెలుచుకున్న సిద్ధార్థ్ (Siddharth), గత కొన్నేళ్లుగా తన ప్రధాన దృష్టిని తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్రీకరించారు. అయితే, తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. కానీ, తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో ఇప్పటివరకు పెద్దగా విజయవంతం కాలేకపోయాడు. ఇటీవల భారతీయుడు 2 సినిమాలో నటించిన సిద్ధార్థ్, ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన కంటెంట్తో ముందుకు సాగిపోతున్నారు.
తాజాగా, సిద్ధార్థ్ (Siddharth) కథానాయకుడిగా నటించిన చిత్రం మిస్ యూ (Miss You) తెలుగులో అదే పేరుతో నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఆషికా రంగనాథ్ (Aashika Ranganadh) కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేమకథా చిత్రంగా రూపొందింది. ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ (Siddharth) మీడియాతో మాట్లాడిన అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Miss You: హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!
మీ సినిమా విడుదల వారానికే పుష్ప 2 (Pushpa 2) థియేటర్లలోకి వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఆ సినిమా మీ చిత్రంపై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సిద్ధార్థ్ (Siddarth) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “నేను నా నియంత్రణలో ఉన్న వాటిపై మాత్రమే మాట్లాడగలను. కానీ, ఇతర విషయాల గురించి మాట్లాడటం అవసరం లేదు. ప్రతి సినిమా కూడా ఒక పెద్ద చిత్రమే. బడ్జెట్ బట్టి సినిమాల్ని చిన్న, పెద్దగా విభజించడం సరికాదు,” అని స్పష్టం చేశారు.
అలాగే, “ఒక సినిమా థియేటర్లలో రెండో వారానికి కొనసాగాలంటే ప్రాధమికంగా ఆ సినిమా బాగుండాలి. ప్రేక్షకులకు నచ్చాలి. అదే జరిగితే తరువాత విడుదల అయ్యే సినిమాలు మా సినిమా గురించి ఆలోచించాల్సి వస్తుంది. నా సినిమా బాగుంటే, థియేటర్లలో తప్పకుండా నిలబడుతుంది. మంచి సినిమాలను ఎవ్వరూ తొలగించలేరు,” అని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Pushpa 2: పుష్ప 2 చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో కిస్సిక్ సాంగ్ విడుదల
సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ రోజుల్లో మంచి చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. “ఇప్పటి కాలంలో, 2006-07లో లాగా, ప్రేక్షకులు సినిమాలను ఎలా మానేజ్ చేయాలో తెలియని పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే మంచి కంటెంట్ ఉంటే అది ఎప్పుడు విజయం సాధిస్తుంది,” అని తెలిపారు. సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పుష్ప 2 వంటి భారీ చిత్రాలు విడుదలవుతున్నా, తన సినిమాపై ఉన్న నమ్మకాన్ని సిద్ధార్థ్ వ్యక్తపరిచిన తీరు అతడి ధైర్యాన్ని సూచిస్తోంది. మరి మిస్ యూ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.