Ram Charan: రామ్ చరణ్.. ఈ గండం దాటితే చాలు

Ram Charan: గేమ్ ఛేంజర్.. భారీ బడ్జెట్, అద్భుతమైన టెక్నికల్ హంగులతో రూపొందుతున్నా, ప్రస్తుతానికి ఆడియన్స్‌లో చరణ్ (Ram Charan)-శంకర్ (Shankar) కాంబోపై మరీ ఎక్కువ హైప్ లేదనే అనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం శంకర్ స్లో పేస్ వర్క్, అలాగే ఇండియన్ 2 కారణంగా అతని పై ఆడియన్స్‌లో ఏర్పడిన నెగటివ్ బజ్. ఈ పరిస్థితిని మార్చాలంటే గేమ్ ఛేంజర్ (Game Changer) ట్రైలర్‌తో ప్రేక్షకులకు పకడ్బందీగా ఎట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

టీజర్ సాంగ్స్ వచ్చినా పెద్దగా సౌండ్ అయితే చేయడం లేదు. తెలుగులో మోస్తరుగా బజ్ ఉన్నా మిగతా భాషల్లో ఏమాత్రం హైప్ లేదు. ఆస్కార్ అందుకున్న RRR ద్వారా రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ చిత్రం విజయం సాధించకపోతే, ఆ క్రేజ్ తగ్గే ప్రమాదం ఉంది. దీంతో అభిమానులు మాత్రం “ఈ గండం గడిస్తే చాలు” అనే భయంతో ఉన్నారు.

Game Changer: నవంబర్ 28న రామ్ చ‌ర‌ణ్, శంకర్ ‘గేమ్ చేంజర్’ థర్డ్ సింగిల్

అసలు సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందన్నది పక్కన పెడితే, కనీసం మార్కెట్‌ను డ్యామేజ్ చేయకుండా నిలబడితే చరణ్ (Ram Charan) కెరీర్‌కు సంతోషించే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉండగా, గేమ్ ఛేంజర్ (Game Changer) తరువాత చరణ్ ప్రాజెక్టులపై మాత్రం భారీ నమ్మకం ఉంది. RC16 కోసం బుచ్చిబాబు పవర్ఫుల్ ప్రాజెక్ట్ రెడీ చేశాడు. బుచ్చిబాబు స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ పై ఫ్యాన్స్ లో నమ్మకం అయితే ఉంది.

ఇక సుకుమార్ కూడా పుష్ప 2 తరువాత చరణ్‌తో (Ram Charan) ప్రాజెక్ట్ ప్లాన్ చేయనున్న విషయం తెలిసిందే. పుష్ప 2 భారీ విజయం సాధిస్తే, ఈ కాంబినేషన్ చరణ్ (Ram Charan) మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో సక్సెస్‌ అనేది శంకర్ మేకింగ్‌ మీదే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా, ట్రోలర్స్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే. ఇప్పటికే ఇండియన్ 2 విషయంలో ట్రోలింగ్ అనుభవించిన శంకర్, ఈ సారి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు.

అలీను ఆ పార్టీ బాగా వాడుకుంది | Dasari Vignan Reveals Shocking Facts About Actor Ali | Ys Jagan | TR