జూనియర్ ఎన్టీయార్ తెగ బాధపడిపోతున్నాడట.!

‘ముందుగానే నిర్ణయమైపోయిన కార్యక్రమాలున్నాయ్.. వాటి కారణంగానే, తాత శత జయంతి వేడుకల్లో పాల్గొనలేకపోయాను. అంతే తప్ప వేరే కారణాల్లేవు..’ అని అంటున్నాడు జూనియర్ ఎన్టీయార్.

ఆ మాట ఓ ప్రెస్ నోట్ రూపంలోనో, లేదంటే ఓ వీడియో బైట్ ద్వారానో జూనియర్ ఎన్టీయార్ చెప్పాల్సి వచ్చేలా వుంది. ‘వీడియో బైట్ అయితే బెటర్..’ అని సన్నిహితులు జూనియర్ ఎన్టీయార్‌కి సలహా ఇస్తున్నారట.

టీడీపీ మహానాడు కంటే ముందే, జూనియర్ ఎన్టీయార్ నుంచి సదరు ప్రకటన రాబోతోందని సమాచారమ్. ఎందుకంటే, ఆ సంబరాల ఉత్సాహంలో, జూనియర్ ఎన్టీయార్‌ని మరింత ట్రోల్ చేసేస్తారు.

జూనియర్ ఎన్టీయార్ మాత్రమే కాదు, ఈ విషయంలో కళ్యాణ్ రామ్ కూడా తప్పు చేసేశాడు. ఇద్దరూ చర్చించుకుని వీడియో బైట్ వదలబోతున్నారట.