AP: వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.. ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా మద్యం గురించి ఎన్నో ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాగడానికి నీళ్లు దొరక కష్టం పడుతుంటే మరోవైపు మద్యం మాత్రం ఏరులై పారుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వ హయామంలో మద్యం కల్తీ జరిగిందనీ విమర్శలు కురిపించారు అయితే వైసిపి దిగిపోయిన నాటికి గోదాములలో మద్యం స్టాక్ ఉంది అదే మద్యాన్ని కూటమి ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని.
పవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోందనీ నాని విమర్శించారు. మద్యం కల్తీ అంటూ ఐదు సంవత్సరాలు వాగిన నోర్లు ఇప్పుడు మూతపడ్డాయి ఇది కూడా తిరుపతి లడ్డు కల్తీ అంటూ అసత్య ప్రచారాలైన అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా కూటమి ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు ధోరణిపై పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.