MLA: ఇటీవల శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రతి ప్రాంతంలో కూడా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఇలా సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు ఎంతోమంది భక్తులు రాజకీయ నాయకులు కూడా పాల్గొని సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష రెడ్డికి సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూడా.. చాలా ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే ఆ నియోజకవర్గంలోని చిప్పగిరిలో కూడా సీతారాముల కల్యాణ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు ఎమ్మెల్యే విరూపాక్ష రెడ్డి హాజరయ్యారు ఈయన సమక్షంలోనే కల్యాణ వేడుకలు జరిగాయి.
ఇదిలా ఉండగా పంతులు సీతమ్మ మెడలో కట్టాల్సిన తాళిని ఎమ్మెల్యేకి ఇచ్చి సీతమ్మని తాకి ఇవ్వమని చెప్పారు కానీ ఆయన మాత్రం ఏకంగా సీతమ్మ మెడలో తాళి కట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా తన గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్ష రెడ్డి స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. సీతమ్మ తల్లికి తాళి కట్టడం తప్పు కానీ తాను పండితులు చెప్పిన ప్రకారమే చేశానని తెలిపారు.పండితులు కట్టమంటే… తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు వివరించారు. దేవుళ్ళ పైన తనకు ఎంతో భక్తి అలాగే విశ్వాసం ఉందని కూడా వివరించారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలా శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన ఈ తప్పుకు తాను ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనగా మారింది.