Y.S.Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడం కంటే కూడా తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే చెప్పాలి. తాజాగా ఈమె మరోసారి తన అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ…వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు’ అని తెలిపారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఏది చేసినా అర్థం.. పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమని కొట్టిపారేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వయం శక్తితో ఎదుగుతుంటే చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం’ అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ’11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు.. ఇక ఈ జన్మకు మారరు అని ప్రజలకు మరోసారి అర్థమైంది’ అని తెలిపారు.
తమ తండ్రి వైయస్సార్ గారి పేరును అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చి వైయస్సార్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ.. రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్ట స్వప్రయోజనాలు పొందాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి పై షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ విమర్శించారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.