Ntr: ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి అనే పేజీ లేకపోతే పీఎం అయ్యగారు: నటుడు అశోక్ కుమార్

Ntr: సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు నందమూరి తారక రామారావు ఒకరు. ఈయన కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తిరుగులేని నాయకుడు అనిపించుకున్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయిన ఈయన చివరి రోజుల్లో మాత్రం దారుణమైనటువంటి అవమానాలను ఎదుర్కొని మరణించారు.

ఇక ఎన్టీఆర్ జీవితం మొదటి నుంచి ఎంతో ఉన్నతంగా గౌరవంగా సాగినప్పటికీ ఆయన జీవితంలోకి ఎప్పుడైతే లక్ష్మీపార్వతి వచ్చారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయని ఆయనకు చాలా దగ్గరగా ఉన్న సన్నిహితులు చెబుతూ ఉంటారు. చాలామంది ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి పెళ్లిని ఒప్పుకోలేకపోయారు అయితే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతినీ పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను తాజాగా నటుడు అశోక్ కుమార్ తెలిపారు.

ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి సంబంధించిన విషయాలను తెలిపారు.ఎన్టీఆర్ గారు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు అశోక్ కుమార్ గారితో కలిసి తన గురువు గారిని సంప్రదించి పెళ్లి చేసుకోవాలా వద్దా అని అడిగితే ఎన్టీఆర్ గారికి నీచ ఛండాల యోగం అలాగే లక్ష్మి పార్వతికి ఛండాల యోగం ఉన్నాయ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆయనకు పవర్ వస్తుందని తెలిపారు.

తమ గురువుగారు ఇలా చెప్పడంతో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవడం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఆ యోగం ఉంటుందని తర్వాత తనని వదిలేయాలని గురువుగారు చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాత్రం లక్ష్మీపార్వతిని వదిలేయలేదు.ఆమెతోనే ఉండటం ఆమె బిడ్డ పుట్టాలని ప్రయత్నించడం అలా ఎవేవో జరిగి ఆయన మరణించారు. నిజానికి ఎన్టీఆర్ గారు, గురువు గారు చెప్పినపుడు లక్ష్మి పార్వతి గారిని దూరం పెట్టి ఉంటే ఆయన పీఎం అయ్యేవారు అంటూ అశోక్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.