AP: వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హీరోయిన్ మాట్లాడుతూ ఉన్న ఒక వీడియోని ఓవర్గానికి చెందిన న్యూస్ చానల్స్ అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుగా వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హీరోయిన్ తో ఎయిర్ పోర్టులో మాట్లాడుతున్న ఒక వీడియోని వైరల్ చేస్తూ దుష్ప్రచారానికి తెర తీశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఇటు ప్రకాష్ రెడ్డి అటు హీరోయిన్ కూడా స్పందించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మా జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లికి వస్తున్నారు. మరణించిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన వస్తున్న నేపథ్యంలో వేలాదిగా అభిమానులు తరలి రాబోతున్నారు అయితే జగన్ ఈ పర్యటన అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం చేతకాలేదు అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీసారంటూ మండిపడ్డారు.
తాను ఎవరితో మాట్లాడుతున్నాను ఏంటి అనే విషయాలు తెలియకుండా ఇలా దుష్ప్రచారం చేయడం సరైనది కాదు ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి. అయినా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నమ్మేస్థితిలో ప్రజలు లేరని గత పాతిక సంవత్సరాలుగా నేను కాపాడుకుంటూ వస్తున్న గౌరవ మర్యాదలను ఇలా కించ పరిస్తే చూస్తూ అసలు ఊరుకోనని తెలిపారు.
ఎవరైతే ఆ వీడియోని అప్‌లోడ్ చేశారో, పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే వైరల్ చేస్తోన్నారో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని తోపుదుర్తి హెచ్చరించారు. కచ్చితంగా వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాప్తాడు నియోజకవర్గంలో నిజాయితీతో రాజకీయాలు చేస్తూ పేదలకు సేవలు అందిస్తోన్న తనపై బురద చల్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు.
మరోవైపునటి సుమయ రెడ్డి స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను డియర్ ఉమ సినిమా ప్రమోషన్లలో ఉన్నానని, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్‌లు, కాల్స్ వస్తోన్నాయని, తీరా చూస్తే ఎయిర్‌పోర్టు వీడియోపై కొందరు నచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ దుష్ప్రచారం చూసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మా బంధువులని ఈమె ఈ వీడియో పై క్లారిటీ ఇస్తూ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.