మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే భారీ హైప్ ఏర్పడింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే RC17 ప్రాజెక్ట్ గురించి తాజా చర్చలు ఊపందుకున్నాయి.
అందరూ భావించినట్లుగానే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం తరహాలో మరో ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ రానుందని ఊహించారు. కానీ సుకుమార్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తెరకెక్కే ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ వర్క్ చేస్తుండటంతో చరణ్ సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో చరణ్ తాత్కాలికంగా మరో దర్శకుడితో RC17 ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ బయటకు వచ్చింది.
ఈ క్రమంలో “కిల్” సినిమాతో పేరు తెచ్చుకున్న హిందీ డైరెక్టర్ నిఖిల్ నాగేశ్ భట్ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఈయన గతంలో చరణ్‌తో సినిమా రూమర్స్‌ను ఖండించినా… “అవన్నీ అసత్యం కాదు” అన్నట్టుగా ఇచ్చిన కామెంట్స్‌తో ఉత్కంఠ కలిగించారు. ప్రస్తుతం ఆయన్ను టచ్‌లోకి తీసుకెళ్లేందుకు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఇండస్ట్రీ టాక్.
యాక్షన్‌తో పాటు ఎమోషన్ కలిపిన కథకు చరణ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని, నిఖిల్ స్టైల్ అలా ఉంటుందనే అభిప్రాయంతో ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. సుకుమార్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని తెలుస్తుండగా, RC17 కోసం రామ్ చరణ్ ఓ కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్టు ఫీలవుతున్నారు. త్వరలో అధికారిక క్లారిటీ వచ్చిన తర్వాత నిజంగా నిఖిల్ చాన్స్ కొట్టేసాడా? లేక మరో కొత్త డైరెక్టర్ ఎంటరౌతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

