Pawan Kalyan: పవన్ కాన్వాయ్ ఎఫెక్ట్… జేఈఈ మెయిన్స్ మిస్ అయిన 30 మంది విద్యార్థులు!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా 30 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది.జేఈఈ మెయిన్స్ టార్గెట్గా ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయారు. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అంటూ ఓ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు పర్యటన కొనసాగించారు.

ఇలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లడంతో 30 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలకు హాజరు కాలేకపోయారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం, మద్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం షిఫ్ట్ పరీక్ష 9.30 నుంచి 12.30 వరకు ఉంటుంది. అయితే గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే 8.30 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు.

విశాఖపట్నంలో జరిగిన పరీక్షకు కొంతమంది విద్యార్ధులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కారణంగా హాజరుకాలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ సెంటర్‌కు చెందిన విద్యార్ధులుు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మొత్తం ఆపివేశారు. తద్వారా సరైన సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు.

పెందుర్తిలోని జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రానికి 8.30గంటలకు కాకుండా 8.32 గంటలకు చేరుకున్నారు. మార్గమధ్యలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల సమయానికి రాలేకపోయాము అంటూ విద్యార్థులు ఎంత బ్రతిమిలాడినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి తెలపలేదు. ఇలా ఏకంగా 30 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాలేకపోవడంతో తమ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ కారణంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న ఇప్పటివరకు ఈ విషయంపై ఏపీ సర్కార్ ఎక్కడ స్పందించలేదు. అయితే ఈ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు.