మంచివారిని దూరం చేసుకుంటే… ముంచేవారే దొరుకుతారు… నాగబాబు కామెంట్స్ వైరల్!

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా పరోక్షంగా తన ప్రత్యర్థులపై కామెంట్లు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా మరోవైపు జనసేన పార్టీ తరఫున రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

తాను ఎవరిని అంత సులువుగా వదులుకోనని ఒకవేళ వదిలిపెట్టాను అంటే వాడి అంత పెద్ద ఎదవ ఉండరంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్ వైరల్ కావడంతో అసలు నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేశారు అంటూ ఆరా తీశారు.నాగబాబు ఇలాంటి కామెంట్ చేస్తారంటే కేవలం ఇది ఆయన సన్నిహితులలో ఎవరో తనకు దూరమై ఉంటేనే చేశారని భావించారు. ఇక ఈ విషయం మర్చిపోకముందే ఈయన మరొక కొటేషన్స్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ షేర్ చేస్తూ… మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు… చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు మంచి వాళ్లను దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దగ్గరవుతారు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కొటేషన్స్ షేర్ చేయడంతో ఎవరిని ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.కొందరు ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ చేస్తారని కామెంట్ చేయడం మరికొందరు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్లు చేశారని భావిస్తున్నారు. మొత్తానికి ఈయన షేర్ చేసిన కొటేషన్ వైరల్ అవుతుంది.