రష్మిక పతనం మొదలైందా… ఏకంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన ప్రముఖ జ్యువెలరీ సంస్థ?

ఎదుగుటవన్ని విరుగుటకే అనే సామెత ఒకటి ఉంది మనం ఎంత తొందరగా అయితే ఉన్నత స్థానానికి వెళ్తామో అంతే తొందరగా మన పతనం కూడా మొదలవుతుందని ఈ సామెత అర్థం అయితే ఈ సామెత రష్మిక విషయంలో నిజమవుతుందని తెలుస్తోంది.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం ఈమెకు బ్యాడ్ టైం నడుస్తోందని ఇండస్ట్రీలో ఈమె పతనం మొదలైందని తెలుస్తోంది.గత కొద్ది రోజులుగా రష్మిక పెద్ద ఎత్తున వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కన్నడ ప్రేక్షకులు కన్నడ చిత్ర పరిశ్రమ ఏకంగా ఈమెను బ్యాన్ చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.

కన్నడ భాష పట్ల కన్నడ చిత్రాల పట్ల రష్మిక వ్యవహార శైలి పెద్ద ఎత్తున వివాదాలను తీసుకువచ్చింది.కన్నడ భాష గురించి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తనకు కాంతార సినిమా చూసే సమయం కూడా లేదంటూ ఈమె తల పొగరు మాటలు చెప్పడం వల్లే ఇండస్ట్రీలో ఈమెను బ్యాన్ చేయాలని భావించారట. ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈమెకు మరోషాక్ తగిలింది.

రష్మిక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నగల సంస్థ అయినటువంటి ఖజానా జ్యువెలరీకి దేశవ్యాప్తంగా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ జ్యువెలరీ సంస్థ నుంచి పలు రకాల డిజైన్లను ఈమె ప్రమోట్ చేస్తూ ఖజానా నగలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.అయితే రష్మికపై ప్రస్తుతం వస్తున్నటువంటి నెగిటివిటీ కారణంగా ఖజానా సమస్త ఏకంగా తనని బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించనున్నట్లు వీరి మధ్య కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈమెని తొలగించడంతో ఈమె స్థానంలో నటి త్రిష నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారని తెలుస్తోంది.మరి ఈ వార్తలలో ఇంతవరకు నిజముందో తెలియదు గానీ ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.