‎Rashmika: కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ గురించి స్పందించిన రష్మిక.. వారు ఏమనుకున్నా పట్టించుకోను అంటూ!

‎Rashmika: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రష్మిక నటిస్తున్న సినిమాలు అన్ని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అవుతుండడంతో ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఈమె పేరే ట్రెండింగ్ అవుతోంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక కు సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‎రష్మిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ థామా. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనేక విషయాల గురించి స్పందించింది. ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీ తనను బ్యాన్ చేస్తోంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. ఈ సందర్భంగా రష్మిక మందన మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా విడుదలైన రెండు, మూడు రోజుల్లో నేను చూడలేను. కాంతార కూడా అంతే విడుదల అయ్యాక కొన్ని రోజులకు చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్‌ కూడా చేశాను.

‎ వాళ్లు నాకు ధన్యవాదాలు తెలిపారు. తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. అలాగే నేను కూడా ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌ లో పంచుకునే వ్యక్తిని కాదు. అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది రష్మిక. కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్‌ చేసిందంటూ వస్తోన్న వార్తలపై రష్మిక సమాధానమిస్తూ.. ఇప్పటి వరకూ నన్ను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు. ఇతరుల కోసం జీవించవద్దు. ఇలాంటి రూమర్స్ అన్నీ అపార్థం వల్ల పుట్టుకొస్తాయని అని తెలిపింది రష్మిక మందన్న.