Rashmika: రష్మిక మందన్న ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన ఈమె ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా రష్మిక మైసా అనే సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మరో సినిమాకి కమిట్ అవుతున్నారని తెలుస్తోంది.
ఇక రష్మిక కొత్త సినిమా ఏ హీరోతో నటించబోతున్నారనేది తెలియడంతో అభిమానులందరూ ఒక్కసారిగా రష్మిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక కోలీవుడ్ హీరో శింబుతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబు స్టార్ హీరో అయినప్పటికీ ఈయనతో సినిమాలు చేసిన వారందరూ కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరోతో సినిమా చేసిన వారందరూ కూడా ఆ హీరో ప్రేమలో పడటమే కాకుండా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
గతంలో నయనతార, రష్మిక, నిధి అగర్వాల్ వంటి వారందరూ కూడా శింబుతో ప్రేమలో పడ్డారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. ఇక తాజాగా రష్మిక కూడా ఈయనతో సినిమా చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు శింబుతో సినిమా చేయాలనుకోవడం ఏంటి పిచ్చి నిర్ణయం కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మిక ఇప్పటికైనా తన ఆలోచనను మార్చుకొని ఈ సినిమా నుంచి తప్పుకుంటుందా లేకపోతే ఈ హీరోతో సినిమాలు చేసి ఇబ్బందులు పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.
