Rashmika: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెబుతారు. ఈ సామెతను మన సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఫాలో అవుతారని చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున వ్యాపారాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కెరియర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కనుక మంచి సక్సెస్ ఉన్నప్పుడే వ్యాపారాలను మొదలుపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతూ ఉంటారు. ఇకపోతే తాజాగా రష్మిక మందన్న కూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఏమాత్రం తీరికలేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా నేడు ఈమె అభిమానులతో పంచుకోబోతున్నారు అయితే ఇటీవల తన తల్లితో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు ఇందులో భాగంగా రష్మిక మాట్లాడుతూ…
“నేను ఈ రోజు చాలా ముఖ్యమైన షూటింగ్‌కు వెళ్తున్నాను. మీరు చెప్పిన బిజినెస్‌ను నేను ప్రారంభించబోతున్నాను” అని రష్మిక తన తల్లి సుమన్ మందన్నకు వీడియో కాల్ ద్వారా సమాచారం అందించింది. కూతురి కొత్త ప్రయత్నానికి తల్లి శుభాకాంక్షలు తెలిపింది. అయితే, తాను ప్రారంభించబోయే బిజినెస్ ఏమిటో రష్మిక ఇంకా తెలియలేదు అయితే ఈమె అందరి మాదిరిగానే బట్టల వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారని అంచనా వేస్తున్నారు. మరి రష్మిక ఏ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఏంటి అనే విషయాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇలా వ్యాపార రంగంలోకి ఈమె అడుగు పెట్టబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
