వామ్మో హన్సిక ఆశలు మాములుగా లేవుగా.. సెంచరీ కొట్టేలనీ ఉందంటున్న ముద్దుగుమ్మ?

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన హన్సిక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమా సీరియల్స్ లో నటించిన హన్సిక దేశముదురు సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలు తగ్గించుకుంది. అయితే ఆమె తెలుగులో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోవటంతో తన దృష్టి తమిళ్ ఇండస్ట్రీ వైపు మళ్ళించింది. 2011లో ‘మాప్పిళ్త్లె’ సినిమాతో తమిళంలో అడుగు పెట్టిన ఈ అమ్మడికి ఆ సినిమా హిట్ ఇవ్వకపోయినా వరుస సినిమాలు చేస్తూ విజయ్ సరసన నటించిన ‘వెలాయుధం’ సినిమాతో విజయాన్ని అందుకుంది.

తన అందం అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక బాలీవుడ్ లో కూడా ‘ఆప్ కా సరూర్’ సినిమాతో హిట్ అందుకుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హన్సిక కన్పించడం లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్న హన్సిక ఇప్పటికే మై నేమ్‌ఈజ్ శృతి అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా ప్రధాన పాత్రలో నటించిన మహా సినిమా కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహా సినిమా హన్సిక కేరీర్ లో 50వ సినిమా. అయితే ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 22న విడుదల అవుతున్న ‘మహా’ సినిమలో తమిళ్ హీరో శింబు ప్రధన పాత్రలో నటించాడు. యు.ఆర్‌.జమీల్‌ దర్శకత్వంలో మదియళగన్‌ నిర్మించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సినిమాతో హాఫ్ సెంచరీ కొట్టిన హన్సిక ఈ సినిమాని అంతగా పట్టించుకోవడం లేదట. సినిమాల విషయంలో హన్సిక ఆశలు చాలా ఉన్నాయి. అందుకే 50 సినిమాల్లో నటించటం చిన్న విషయం.. సెంచరీ కొట్టాలన్నది తన ఆశ అని చెప్పుకొచ్చింది హన్సిక.