‎Hansika: ఏంటి.. హీరోయిన్ హన్సిక విడాకులకు సిద్ధమయిందా.. అందుకే భర్తకు దూరంగా ఉంటోందా?

Hansika: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు హిందీ తమిళ భాషల్లో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 50 పైగా సినిమాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తమిళంలో ధనుష్‌, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్‌ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హన్సిక.

‎అత్త హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్‌ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. అయితే సోహల్‌ కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రసారం వైరల్‌ అవుతోంది.

‎సోహల్‌ ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలపై హీరోయిన్ హన్సిక ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. కాగా హన్సిక మొన్నటి వరకు తెలుగులో ఢీ షోకి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తున్నారు. మరి హన్సిక విడాకుల వార్తలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.