‎Hansika: విడాకుల రూమర్స్.. షాకింగ్ పోస్ట్ చేసిన హన్సిక.. ఆ వార్తలు నిజమయ్యేనా!

‎‎Hansika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితం పై గత కొద్దిరోజులుగా అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విడాకులకు సిద్ధమవుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తన భర్తకు దూరంగా ఉంటుందని, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూరుస్తూ ఆమె ఇటీవల ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసింది.

‎దాంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది నమ్మారు. ఆ ఫోటోలు డిలీట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇలా విడాకుల వార్తలు వినిపిస్తున్న సమయంలో తాజాగా హన్సిక సోషల్ మీడియాలో చేసిన ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. అదేమిటంటే ఇటీవల ఆగస్టు 9వ తేదీన హన్సిక తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.

‎నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టిన రోజున మీ అందరి శుభాకాంక్షలతో నా మనసు ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని హన్సిక ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె విడాకులకు సిద్ధమయ్యిందా, తన పెళ్లి గురించి ఇలాంటి కామెంట్లు చేసిందా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హన్సిక మాత్రం విడాకుల వార్తలపై స్పందించడం లేదు.