కార్తీకదీపం సీరియల్ నటి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Tollywood Actress: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లు మొత్తం పెద్దగా మారిపోయి కథ మొత్తం మార్చేశారు. ఈ క్రమంలోనే హిమ, సౌర్యకు మేనత్త పాత్రలో నటిస్తున్నటువంటి స్వప్న అలియాస్ సుష్మ కిరణ్ గురించి మనకు తెలిసిందే. ఇదివరకే ఈమె పలు సీరియల్స్ లో, టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా ఇన్ని రోజులు వివిధ సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుష్మా కిరణ్ ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో మెయిన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇక సుష్మా కిరణ్ బుల్లితెర నటుడు రవి కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రవి కిరణ్ కూడా బుల్లితెరపై ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈయన బుల్లితెరపై నటుడిగా 2002వ సంవత్సరంలో తన కెరీర్ ప్రారంభించారు.

నిజం అనే సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయిన రవికిరణ్ అనంతరం అభిషేకం,చిన్న కోడలు సీరియల్ లో ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఆయన బుల్లితెర సీరియల్స్ కి దూరంగా ఉన్నారు.ఇక ఈయన బుల్లి తెరకు దూరంగా ఉండడంతో ఆయన భార్య సుష్మా కిరణ్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో ఈమె పాత్ర ఎంతో కీలకంగా ఉందని చెప్పాలి. ఇక ఈ దంపతులకు భరత్ అనే కుమారుడు కూడా ఉన్నారు.