బన్నీ నా బంగారం : రాజేంద్రప్రసాద్‌

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ దర్శకత్వంలో శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ హరికథ. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గోన్న నటకిరీటి మాట్లాడుతూ.. కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా.. నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే దొంగ (పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ పాత్ర).. వాడు హీరో.. హీరోల్లో అర్థాలు మారిపోయాయి.. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా నేను సమాజంలో మన చుట్టూ ఉన్న ట్వంటి పాత్రలతో డిఫరెంట్‌ హీరో అనిపించుకున్నా.. అంటూ కామెంట్‌ చేశాడు.

అయితే రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు పుష్ప 2 ది రూల్‌ మూవీని ఉద్దేశించి చేసినవే ఈ వ్యాఖ్యలు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్‌ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్‌ యూ అంటూ రాజేంద్రప్రసాద్‌ తెలిపాడు.

నేను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కాదా కొత్తగా ఇది వచ్చింది అంటూ ఎంజాయ్‌ చేశాను. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెబుతున్నాను. అది అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అనలేదు. వాడు నా కొడుకు లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చాడు.