తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తల్లిపాలలో యాంటీబాడీలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయని చెప్పవచ్చు. ఇవి బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తల్లిపాలు తాగే శిశువులకు చెవి ఇన్ఫెక్షన్లు, కడుపు దోషాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
తల్లిపాలు తాగే పిల్లల్లో ఆస్తమా, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి ఈ పాల వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచడంలో తల్లి పాలు తోడ్పడతాయి. బిడ్డకు అలర్జీలు, ఇన్ఫెక్షన్లు సోకకుండా తల్లి పాలు ఉపయోగపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
బిడ్డ తల్లి పాలు తాగడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లి పాలు తాగడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలు సులువుగా లభిస్తాయని చెప్పవచ్చు. తల్లిపాలలో ఉండే పాలిఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శిశువులో మెదడు పెరుగుదలకు తోడ్పడతాయని చెప్పవచ్చు. తల్లిపాలు తాగడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు అయితే లేవు.
తల్లి పాలు తాగే పిల్లలు ఊబకాయం బారిన పడే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు. తల్లిపాలు ఇస్తే శిశువుకే కాదు తల్లికి కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తల్లి పాల వల్ల పిల్లలకు జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు.