Pushpa 2 Box Office: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా మార్కెట్‌లో 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు తిరగరాసింది. అయితే సినిమా ప్రతి ప్రాంతంలో సక్సెస్ కావడం కష్టమే. ముఖ్యంగా కోలీవుడ్ మార్కెట్‌లో పుష్ప 2 అంచనాలను అందుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ హైప్‌తో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేకపోయింది.
తమిళనాడులో ఈ సినిమా 52 కోట్ల బిజినెస్ చేసుకుని విడుదలైనప్పటికీ, ఫైనల్ రన్‌లో మాత్రం దాదాపు 34.86 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా అక్కడ 80.50 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. దీంతో బయ్యర్లకు దాదాపు 17.14 కోట్ల నష్టం ఎదురైంది. భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, టార్గెట్ రీచ్ కాలేకపోవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక కేరళలో కూడా సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.
అయితే, హిందీ మార్కెట్‌లో సినిమాకు మాత్రం అనూహ్యమైన విజయమొచ్చింది. అక్కడ ఏకంగా 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదవడంతో కోలీవుడ్, మళయాళం మార్కెట్‌లో వచ్చిన నష్టాన్ని సినిమా కవర్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా నైజాం, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేయడం సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చింది.
సుకుమార్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, అల్లు అర్జున్ మాస్ లుక్ ఇవన్నీ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. పుష్ప 2 తమిళనాడు మార్కెట్‌ను ఊహించిన స్థాయిలో ప్రభావితం చేయలేకపోయినా, మిగతా ఇండస్ట్రీల్లో భారీగా రాణించడంతో సినిమా మొత్తం వసూళ్ల పరంగా సూపర్ హిట్‌గా నిలిచింది.