పగటిపూట నిద్రపోతే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. ఈ విషయాలు తెలుసా?

మనలో చాలామంది పగటిపూట నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని ఫీలవుతారు. అయితే పగటిపూట నిద్రపోవడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని సర్వేల ద్వారా ఈ విషయం వెల్లడైంది. పగటి నిద్ర వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ అందుతుంది. శరీరానికి మెదడుకు అవసరమైన రీఛార్జ్ ను అందించడంలో పగటి నిద్ర ఎంతగానో దోహదపడుతుంది.

కొంత సమయం పాటు నిద్ర పోవడం వల్ల చేసే పనులపై దృష్టి పెరిగే అవకాశాలు ఉంటాయి. మెదడు పనితీరును సైతం మెరుగుపరిచే విషయంలో పగటి నిద్ర తోడ్పడుతుంది. పగటి నిద్ర వల్ల సెరటోనిన్ ఉత్పత్తి కావడంతో పాటు ఇరిటేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. పగటి నిద్ర వల్ల ఆందోళన తరహా సమస్యలను సైతం దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధ పడేవాళ్లు పగటి పూట నిద్ర పోవడం వల్ల బీపీ సైతం సులువుగా కంట్రోల్ లో ఉంటుంది. పగటి నిద్ర గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు పగటి నిద్రకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. పగటి నిద్ర ఇమ్యూనిటీ పవర్ ను సైతం పెంచుతుందని చెప్పవచ్చు.

మధ్యాహ్నం నిద్రపోతే మొటిమలు రావట! పగటి పూట కునుకుతో …పగటి నిద్రపోవడం వల్ల శక్తి, మానసిక ఆరోగ్యం, పనితీరు, అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుంది. అయితే, ఎక్కువగా నిద్రపోవడం వల్ల అనారోగ్యం, మరణాల ప్రమాదం పెరుగుతుంది. 15 నిమిషాల కంటే తక్కువ సేపు నిద్రపోవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుందని చెప్పవచ్చు.