Nagachaitanya: మల్టీ స్టారర్ సినిమాపై నాగచైతన్య కామెంట్స్… ఆ హీరోతో చేయాలని ఉందంటూ?

Nagachaitanya: ఇటీవల కాలంలో ప్రేక్షకులు తెరపై ఒక హీరో కాకుండా మరొక హీరో కనిపించడంతో ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషంగా ఆ సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొంతమంది డైరెక్టర్లు కూడా మల్టీ స్టార్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి కొనసాగుతూనే వస్తున్నాయి.

ఇలా ఎంతోమంది హీరోలు కలిసి ఒకే సినిమాలో సందడి చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్న నేపథ్యంలో ఒకే సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలందరూ కూడా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య సైతం ఇదివరకు ఎంతోమంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

వెంకటేష్, నాగార్జున, అమీర్ ఖాన్, వంటి వారితో కలిసి ఈయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల తండేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మల్టీస్టారర్ సినిమాల గురించి యాంకర్ ప్రశ్నించారు. మీరు మల్టీ స్టార్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు అఖిల్ లేదా అల్లు అర్జున్ ఇద్దరితో చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారో అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ అఖిల్ తో కలిసి నేను ఇది వరకే మనం సినిమాలో చేశాను అందుకే అల్లు అర్జున్ తో కలిసి మల్టీ స్టార్ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాను అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నాగచైతన్య కోరికను అల్లు అర్జున్ నెరవేరుస్తారా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు ఏ డైరెక్టర్ తీసుకు వస్తారు అనే విషయాలపై అభిమానులు చర్చలు జరుపుతున్నారు.