Anasuya: ఛాన్స్ కావాలంటే పక్కలోకిరా అంటూ పిలిచారు… అనసూయ సంచలన వ్యాఖ్యలు!

Anasuya: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడే అవకాశాలు కూడా వస్తాయని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. అయితే ఇలాంటి ఇబ్బందులు మహిళలకు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అన్ని రంగాలలో కూడా ఉంటాయని అయితే ఏదైనా కూడా మన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇదివరకు సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా నటి అనసూయ భరద్వాజ్ సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో కలిసి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయకు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నలకు అనసూయ సమాధానం చెబుతూ ఇండస్ట్రీలో ఎంతోమంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు తాను కూడా ఇలాంటి సమస్యను ఫేస్ చేశానని అనసూయ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు కావాలి అంటే పక్కలోకి రా అంటూ ఒక హీరోతో పాటు డైరెక్టర్ కూడా తనని కమిట్మెంట్ అడిగారని తెలిపారు. అలా వారు అడగడంతో నేను ఒకటే మాటే వారికి నో అంటూ సమాధానం చెప్పాను.

స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇలాగే చాలామంది ప్రపోజ్ చేసేవారు. అప్పుడు ఎలాగైతే రిజెక్ట్ చేసానో ఇప్పుడు కూడా అదే విధంగా రిజెక్ట్ చేసానని తెలిపారు. ఇండస్ట్రీలోకి కొత్తవారు రావాలి అంటే దర్శకులు వారిని కమిట్మెంట్ అడిగి అవకాశాలు ఇవ్వకుండా వారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని గుర్తించి అవకాశాలు ఇచ్చినప్పుడే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు కూడా ఎక్కువ మంది వస్తారని అనసూయ తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న కమిట్మెంట్స్ గురించి అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.