మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో మెడ నొప్పి వేధిస్తూ ఉంటుంది. మెడనొప్పికి ప్రమాదాలు, స్పోర్ట్స్ గాయాలు, పడిపోవడం వల్ల కలిగే గాయాలు కారణమవుతాయి. కణితులు, తిత్తులు లేదా ఎముక స్పర్స్ కూడా మెడనొప్పికి కారణమవుతున్నాయి. నిద్ర భంగిమలకు సంబంధించిన పొరపాట్లు కూడా మెడనొప్పికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
కంప్యూటర్ వద్ద కూర్చోవడం లేదా స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ ఉండడం వల్ల కూడా తరచుగా మెడనొప్పి వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మెడనొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పి ఉన్న ప్రాంతంలో వెచ్చని గుడ్డ లేదా హీటింగ్ ప్యాడ్ ఉంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మెడనొప్పికి కారణమేమిటో గుర్తించడం ద్వారా వేగంగా చికిత్స అందేలా చేయవచ్చు.
మెడనొప్పి తగ్గకుండా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మెడనొప్పికి కారణమయ్యే అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన్చి ఫలితాలను పొందవచ్చు. మెడనొప్పితో కూడిన తలనొప్పి ఉంటే, నొప్పికి కారణమేమిటో సకాలంలో గుర్తించేలా జాగ్రత్త పడాలి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే వాళ్లు మెడ భంగిమ విషయంలో జాగ్రత్త వహించాలి.
కంప్యూటర్ ముందు కూర్చునే సమయంలో మెడనొప్పి రాకుండా సరైన చైర్ ను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం ద్వారా కండరాలు రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి.