Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇలా ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సినిమాల గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు కావడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నలు రావడంతో నాగచైతన్య స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడు ఉంటారు. అయితే మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కూడా అలా జరిగి ఉండకూడదు అలా జరగడం దురదృష్టకరం. ఏం జరిగినా ఒకరి కోసం ఒకరు ఉంటామని తెలిపారు. అల్లు అర్జున్ ఏం చేశారో నాకు తెలుసు. కానీ ఇది జీవితం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటూ మాట్లాడారు.
ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించిన సంగతి తెలిసిందే. అందులో నాగచైతన్య అఖిల్ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని పరామర్శించిన సంగతి మనకు తెలిసిందే.