YS Jagan: బడ్జెట్ విషయంలో మౌనం పాటిస్తున్న వైయస్ జగన్… మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి?

YS Jagan: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే ఎనిమిదవ సారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ పై అన్ని రంగాలవారు స్పందించారు. ఇటు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా బడ్జెట్ పై స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఇక ఈ బడ్జెట్ పై ఇతర రాష్ట్రాల నాయకులు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించారు కానీ వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో బడ్జెట్ విడుదల చేయగానే వెంటనే ప్రెస్ మీట్ నిర్వహిస్తూ అన్ని విషయాలను స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడంతో అసలు జగన్ ఎందుకు బడ్జెట్ విషయంలో మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ విషయంలో మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేంద్రంతో పూర్తిగా దూరం పెరిగిపోయింది. ఈ 8 నెలల కాలంలో కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన సందర్భాలు ఎక్కడా లేవు కేవలం ఒకసారి మాత్రమే సాయిరెడ్డి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో మాత్రమే భేటీ అయ్యారు.

ఇలా కేంద్ర ప్రభుత్వంతో దూరం పెరిగిన నేపథ్యంలోనే బడ్జెట్ గురించి పెద్దగా జగన్ పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇక రెండవ కారణం వచ్చేసి తాను బడ్జెట్ గురించి మాట్లాడిన చివరికి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలోనే జగన్ మౌనంగా ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల వరకు కేంద్ర ప్రభుత్వ తీరును చూసి చూడనట్టు వెళ్లటమే మంచిదని జగన్ భావించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి కేంద్రం గురించి కాస్త అటు ఇటు మాట్లాడిన ఆయన కేసులు తిరిగి మొదటికే వస్తాయి.తనపై ఉన్న కేసుల్లో కదలిక వస్తే.. అప్పుడు కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందన్న చర్చ కూడా ఉంది. అందుకే.. అన్ని కోణాల్లోనూ ఆలోచించే జగన్ మౌనంగా ఉన్నారని తెలుస్తుంది.