Nagababu: రాజశేఖర్ రెడ్డి జగన్ కే భయపడలేదు… ఆఫ్ట్రాల్ పెద్దిరెడ్డి ఎంత: నాగబాబు

Nagababu: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జనసేన నిర్వహిస్తున్నటువంటి జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నాగబాబు పుంగనూరు నియోజక వర్గం సోమల గ్రామంలో ఏర్పాటు చేసిన జనంలోకి జనసేన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్న ఇంకా అది చెయ్యలేదు ఇది చేయలేదు అంటూ కొంతమంది వైసీపీ గూండాలు ఇప్పటికీ వాగుతున్నారు అంటూ నాగబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛన్ ఏకంగా వేయి రూపాయలు పెంచుతూ ఇంటి వద్దకే పంపిస్తున్నాము దివ్యాంగులకు రెండింతల పెన్షన్ అందజేస్తున్నాము. రోడ్లు మరమ్మత్తు చేస్తున్నాం, అలాగే మెగా డీఎస్సీకి చర్యలు చేపడుతున్నాము. ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా ఉచిత సిలిండర్ ని పంపిణీ చేసాము ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చాము. పోలవరం కోసం అమరావతి కోసం కేంద్రం నుంచి నిధులను కూడా తీసుకువచ్చామని తెలిపారు.

ఇలా వచ్చిన 8 నెలలలోనే ఇన్ని చేస్తున్న కొంతమంది మాత్రం కూటమి ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇక పుంగనూరు విషయానికొస్తే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలామంది భయపడుతున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ కొంతమంది నాకు చెప్పారు. పెద్దిరెడ్డి కాదు కదా వాళ్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డికే మేము భయపడలేదు.. ఆఫ్ట్రాల్ పెద్దిరెడ్డి ఎంత… ఇక్కడ ఎవరిని అడిగినా పెద్దరెడ్డి మోసాలను అక్రమాలను కథలుగా చెబుతారని నాగబాబు తెలిపారు.

ఎంతో న్యాయంగా ధర్మంగా ముందుకెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ న్యాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి వచ్చినా, పిచ్చిరెడ్డి వచ్చిన ఐ డోంట్ కేర్ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.