Nagababu: ఇక వైసీపీ గెలిచే ఛాన్స్ లేదు…. సింగిల్ డిజిటికే పరిమితం…. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జనంలోకి జనసేన పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బహిరంగ సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పుంగునూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నాగబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై దాడులు చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఎదవ పనులను బయట పెడితే దౌర్జన్యం చేయడం ఏంటి అంటూ ఈయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ సవాల్ విసిరుతున్నారు అసలు మీరు అధికారంలోకి వస్తారని కలలు మాత్రమే కనండి మీరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అంటూ మాట్లాడారు.

ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇంకా చాలామంది కూడా బయటకు వస్తారు. జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు రావడం ఓలెక్కన అంటూ మాట్లాడారు. ఇలా వైసిపి నుంచి ఎంతోమంది వలసలుగా కూటమిలోకి వస్తారని ఇక జీవితంలో జగన్ ముఖ్యమంత్రి కాలేడని, ప్రస్తుతమున్న 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతాయి అంటూ నాగబాబు జోస్యం చెప్పారు. ఇక తనకు మంత్రి పదవి ఇస్తారంటూ వస్తున్న వార్తలపై కూడా ఈయన స్పందించారు. నేను మంత్రి పదవులను ఆశించి రాజకీయాలలోకి రాలేదని నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.