Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను ఈయనకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తన సోదరి నారా భువనేశ్వరి నందమూరి నారా కుటుంబాలకు ఒక ప్రైవేటు పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ పార్టీలో భాగంగా ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు హీరోలు కూడా పాల్గొన్నారు కానీ ఈ పార్టీకి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లకు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి బాలయ్యను ప్రశ్నిస్తూ..మెన్షన్ హౌస్‌కి.. నీకు.. ఏంటా సంబంధం అని అడిగిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
నా జీవితంలో ఎన్నో యాదృచ్ఛికంగా జరిగాయి అలాంటి వాటిలో మాన్షన్ హౌస్ ఒకటి అని తెలిపారు. దానితో నాకు ప్రత్యేకమైన సంబంధం ఏమాత్రం లేదని వెల్లడించారు. అది నన్ను ప్రేమించిందని వెల్లడించడు. వసుంధర, మెన్షన్ హౌస్ నాకు రెండు కళ్ళు అంటూ బాలయ్య ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తన భార్య వసుంధర తనకు ఎంత ముఖ్యమో మ్యాన్షన్ హౌస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని బాలకృష్ణ చెప్పకనే చెప్పేశారు. ఇక బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఒక బ్యాగ్ తన చేతిలో ఉంటుందని అందులో తప్పనిసరిగా మెన్షన్ హౌస్ బాటిల్ ఉంటుంది అంటూ తన చిన్నల్లుడు ఓ సందర్భంలో బయటపెట్టిన సంగతి తెలిసిందే.