Roja: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో కేంద్రంలో కూడా బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా చంద్రబాబు నాయుడు బిజెపికి పూర్తిస్థాయిలో మద్దతు తెలపడంతోనే కేంద్రంలో మోడీ మరోసారి ప్రధానిగా నిలిచారు. ఇదే అదునుగా భావించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు వివిధ రంగాలలో కూడా కేంద్రాన్ని నిలదీస్తే హక్కులు పూర్తిగా ఉన్నాయి.
ఇలా ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్ ఈ రెండు రాష్ట్రాలు మద్దతు తెలపడంతోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టగా బీహార్ కు పెద్ద ఎత్తున వరాలు కురిపించిన నిర్మలమ్మ ఏపీ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు ఈసారి బడ్జెట్లో కూడా ఏపీకి మొండి చేతులు చూపించారు. ఇలా ఏపీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో వైకాపా తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించలేదు.
ఈ క్రమంలోనే వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం బడ్జెట్ విషయంలో కూటమి నేతలు మౌనంగా ఉండటం పై స్పందిస్తూ ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్ చేసారు. గతంలో వైకాపా ఎంపీలను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను మనం గుర్తు చేసుకుందాం అంటూ ఈమె చెప్పుకు వచ్చారు..రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు.
వైకాపా, హయామంలో కేంద్రంలో బిజెపి పూర్తిస్థాయి మెజారిటీతో ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా సరే ఎప్పటికప్పుడు వైయస్ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది.. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ రోజా ప్రశ్నిస్తూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.